పొదిలి పోలీసు స్టేషన్ ను సందర్శించిన యస్పీ మల్లికా గార్గ్

ప్రకాశం జిల్లా యస్పీ గా బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ తొలిసారి పొదిలి పోలీసు స్టేషన్ ను సందర్శించారు.

స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ ను బుధవారం నాడు సందర్శించిన యస్పీ మల్లికా గర్గ్ కు పొదిలి సర్కిల్ పరిధిలోని సిఐ ఎస్సైలు పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు పొదిలి యస్ఐ శ్రీహరి, మర్రిపుడి యస్ఐ సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు