విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి : ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

విద్యార్థులు చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాలలో నైపుణ్యం కలిగి ఉండాలని ప్రకాశంజిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకాంక్షించారు.

వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఆల్ఫా విద్యాసంస్థల రెండవ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ కౌశల్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో నైపుణ్యం కనపరచి ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని కేవలం మార్కుల కోసమే చదవడం వలన పిల్లలు మానసికంగా ఎదగలేరని కాబట్టి వారికి ఆ రంగంలో ఆసక్తి ఉందొ తెలుసుకుని వారిని ఆ రంగంలో రాణించే విధంగా కృషి చేయాలని సూచించారు.

అలాగే విద్యాసంస్థలు కూడా పిల్లలను ఒత్తిడితో కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నిఘా విభాగం సిఐ వెంకటేశ్వరరావు, పొదిలి సిఐ చిన్న మీరా సాహెబ్, పొదిలి యస్ఐ శ్రీరామ్, కొనకనమిట్ల యస్ఐ బాలకృష్ణ, ట్రైనీ యస్ఐ భవాని, ఆల్ఫా విద్యాసంస్థల చైర్మన్ గణేశుని మాల కొండారెడ్డి, ఆల్ఫా విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.