పారిశుద్ధ్య కార్మికులకు హెల్మెట్లను ప్రకాశం జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కైలాస గిరీశ్వర్ అందజేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో ఇటీవల నమోదయిన కోవిడ్ నిర్ధారణ కేసులకు సంబంధించిన రెడ్ జోన్ ప్రాంతాలలో అలాగే పట్టణంలోని పరిస్థితులు గురించిన సమీక్షలో భాగంగా గురువారంనాడు పొదిలి గ్రామ పంచాయతీ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా పరిషత్ సిఈఓ కైలాస గిరీశ్వర్ పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుల జాగ్రత్త చర్యలలో భాగంగా హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డి శ్రీనివాసుల రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మనాయుడు, శానిటరి ఇన్స్పెక్టర్ మారుతీరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.