లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదోరైకు వినతిపత్రం ఇచ్చిన జడ్పీటిసిలు
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాతో బాటు ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్పించాలని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకి ఢిల్లీలో పార్లమెంట్ వద్ద పొదిలి జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు కొనకనమీట్ల మెట్టు వెంకటరెడ్డి తదితర జడ్పీటిసి సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీలు విభజన చట్టంలో ప్రాంతాలవారీగా రాయలసీమ, ఉత్తరరాంధ్ర అని పేర్కొని వాటికన్నా వెనుకబడిన ప్రకాశం జిల్లాని విస్మరించడం వలన తాము నష్టపోయాము అని పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా కాకుండ ” మానవ అభివృద్ధి సూచికల ” ఆధారంగా గణించి ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి తగిన న్యాయం చేయాలని కోరారు. గతంలో ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి తయారుచేసిన నివేదిక ” ప్రకాశించని ప్రకాశం ” రిపోర్టును తంబిదురైకి అందచేశారు. కార్యక్రమంలో కె కె మెట్ల,తాళ్లూరు, టర్లుపాడు, గుడ్లూరు జడ్పీటీసీలు మెట్టు వెంకటరెడ్డి, మారం వెంకట్ రెడ్డి, బాషాపతి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.