ప్రతిభా పురస్కారాలు అందుకున్న అరుణ, గోపాలకృష్ణ
73వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల స్టాఫ్ నర్సు అరుణ, భవిత పాఠశాల అధ్యాపకులు గోపాలకృష్ణలు ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.
ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో ఒంగోలు పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో అనంతరం ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. ఈ పురస్కారాలలో భాగంగా విధులలో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న చాగంటి అరుణకు అలాగే భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల నందు అధ్యాపకులుగా పనిచేస్తున్న గోపాలకృష్ణలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్డ్ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లు ప్రతిభా అవార్డులను అందజేశారు.