ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతాపార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే భారత ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ భారతీయ జనతాపార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం మాస్క్ లు , శానిటైజర్స్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడు గ్రామాల్లో శానిటైజర్స్ ,మాస్క్ లు గుడ్లు ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు
పొదిలి మండల బిజెపి అధ్యక్షులు మాకినేని అమర్ సింహా సారధ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు అజయ్, పవన్ రాజ్ , చంద్రశేఖర్, మాగులూరి రామయ్యా, శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నాయకులు వెంకట్, ఆకుపాటి లక్ష్మణ్, భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు దాసరి మల్లి తదితరులు పాల్గొన్నారు