23 తేదీ నుంచి పృధులగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
పృధులగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 23 తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎప్రిల్ 2 తేదీ వరకు జరుగుతాయిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి నిమ్మగడ్డ వెంకట రవికుమార్ ఒక ప్రకటన లో తెలిపారు
వివరాల్లోకి వెళితే పొదిలి కొండపై నివాసులైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 23 తేదీ మంగళవారం నాడు అంకురార్పణ 24వ తేదీ బుధవారం నాడు శేషవాహనం 25వ తేదీ గురువారం నాడు హంసవాహనం 26వ తేదీ శుక్రవారం నాడు సింహా వాహనం 27వ తేదీ శనివారం హనుమంత వాహనం 28వ తేదీ నుంచి ఆదివారం గరుడోత్సవం 29వ తేదీ సోమవారం ఎదురుకోల ఉత్సవము, రాత్రి గాజోత్సవము 30వ తేదీ మంగళవారం నాడు రథోత్సవం 31వ తేదీ బుధవారం నాడు అశ్వవాహనం ఎప్రిల్ 1వ తేదీ గురువారం నాడు పూర్ణాహుతి 2వ తేదీ శుక్రవారం నాడు ఏకాంతసేవ తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయిని 28వ తేదీ తీరుణాల రోజు ఎలక్ట్రిక్ ప్రభ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని కార్యనిర్వహణాధికారి నిమ్మగడ్డ వెంకట రవికుమార్ తెలిపారు