ముగిసిన కబ్బాడీ పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 10,11,12 తేది ల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కబ్బాడీ పోటీలు శుక్రవారం నాటి ఫైనల్ మ్యాచ్ తో ముగిసాయి.
రాష్ట్ర స్థాయి కబ్బాడీ పోటీల మొదటి బహుమతి యర్రం గణేష్ రెడ్డి టీం పొదిలి రెండోవ బహుమతి చెన్నారెడ్డి టీం కొత్తపల్లి, మూడో బహుమతి లింగోస్ టీం విజయవాడ, నాల్గవ బహుమతి సాయి టీం విజయవాడ, ఐదో బహుమతి గజ్జలకొండ టీంలు గెలుపొందినట్లు నిర్వాహకులు మల్లెల సన్నీ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర స్థాయి కబ్బాడీ పోటీలకు ముండ్లమూరి ప్రసాద్, పి బసవయ్య, వై బాల గురవయ్య, యు శ్రీనివాసులు, యస్ యన్ రాజన్, నరసింహారావు, ఎం వి నారాయణ, స్టీఫెన్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహారించారు.