బిజేపి ఆధ్వర్యంలో టీటీడీ భూములను రక్షించాలని నిరసన దీక్ష
తిరుమల తిరుపతి దేవస్థానము వారి భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పొదిలి శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రాబ్యాంక్ విధి నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హిందూ దేవస్థానాల భూములను రక్షించాల్సింది పోయి వాటిని వరుసపెట్టి వేలం వేయాలని తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని….. దాతలు భక్తితో స్వామివారికి సమర్పించిన ఆస్తులను అమ్ముకొవడం అనేది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు….. ప్రభుత్వాలకు హిందూ దేవస్థాన భూములు అమ్ముకోవడం పరిపాటిగా మారింది అంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ బిజెపి అధ్యక్షులు ఆకుపాటి లక్ష్మణ్, బిజెపి సీనియర్ నాయకులు మాగులూరు రామయ్య, చాట్ల అరుణ్ కుమార్, మేడ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.