సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలు పెంపును నిరసిస్తూ నిరసన
రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలలో వినియోగదారుల విద్యుత్తు బిల్లు భారీగా పెంపును నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు స్థానిక లెనిన్ భవన్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని అధిక విద్యుత్ చార్జీలు పెంపును తగ్గించి వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పట్టణం కార్యదర్శి కెవి రత్నం ఈ కార్యక్రమంలో డిమాండ్ చేశారు.