లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాలు మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా నేడు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా శుక్రవారం నాడు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం, లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ ఖాదర్ భాషా, జి శ్రీను, యస్ సుబ్బారావు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.