ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.

వివరాల్లోకి మంగళవారం నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు ఏర్పాటు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ మనుషులు వైషమ్యాలతో సహనాన్ని, మానవత్వాన్ని కోల్పోయి ఈర్ష్య, ద్వేషాలతో జీవనం సాగిస్తున్నారని, అశాంతి నుంచి ప్రశాంత స్థితిని సాధించడానికి,ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా మార్చేందుకు యోగా తోడ్పడతుందని,యోగా కేవలం వ్యాయమం, ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదని,యోగ శక్తిమంతమైన జీవన మార్గమని అన్నారు.

మనసు లగ్నం చేసి క్రమం తప్పకుండా సాధన చేస్తే మనిషిని శారీరకంగా మానసికంగా యోగా ఉన్నత స్థితికి చేరుస్తుందని అన్నారు.

ఐక్యరాజ్యసమితి జూన్ 21 వ తేదీన “అంతర్జాతీయ యోగా దినోత్సవం”గా గుర్తించినదని,ఇప్పుడు ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని న్యాయమూర్తి భార్గవి అన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తులకు,న్యాయవాదులకు,కోర్ట్ సిబ్బందికి యోగా గురువు ఎ సతీష్ అసనములు‌ యొక్క విశిష్టతను గురించి తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి భార్గవి న్యాయ వాదులు జి శ్రీనివాసులు, రాఘవ మరియు కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.