పొదిలిటైమ్స్…… ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డు గ్రహీత పులగొర్ల శ్రీనివాస్ యాదవ్

ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డు గ్రహీతగా పులగొర్ల శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. కంభాలపాడు గ్రామ పంచాయితీ సర్పంచ్ గా పంచాయతీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి కోట్ల రూపాయలతో పంచాయతీ అభివృద్ధిలో భాగస్వామి అవడమే కాకుండా వ్యక్తిగతంగా సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తూ, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో పనిచేసిన పులగొర్ల శ్రీనివాస్ యాదవ్ ను పొదిలి టైమ్స్ ఉత్తమ ప్రజా ప్రతినిధి అవార్డును ప్రధానం చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు