ట్రాక్టర్ ఢీకొని మాజీ సర్పంచ్ మృతి
కొనకనమిట్ల మండలం పెదారికట్ల – ఇరసలగుండం రహదారిపై ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇరసలగుండం మాజీ సర్పంచ్ కరేటి పుల్లయ్య మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే పెదారికట్ల గ్రామం నుండి ఇరసలగుండంకు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరిన కరేటి పుల్లయ్యను మార్గం మధ్యలో ఎదురుగా కర్రలలోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.