రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు : ఏఓ వెంకటేష్
రైతుల భరోసా కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు జరుగుతాయని మర్రిపూడి మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక గుండ్లసముద్రం గ్రామ రైతు భరోసా కేంద్రం సందర్శించిన మండల వ్యవసాయ అధికారి ఏ వో వెంకటేష్ రైతులు వాలంటీర్లతో సమావేశమై అనంతరం ఆయన మాట్లాడుతూ,ఖరీఫ్ సీజన్ 2021 లో వరి పంట సాగు చేసి ప్రభుత్వ మద్దత్తు ధర అమ్ముకోవాలనుకునే రైతులు ప్రభుత్వం రైతుల సమక్షంలోనే రైతు భరోసా కేంద్రాల కొనుగోలు చేస్తారని తెలిపారు.
ప్రస్తుతం వరి ధ్యానం ప్రభుత్వ మద్దత్తు ధరలు సాధారణ (కామన్ )రకము క్వింటల్ (100 కే. జి ) లకు ధర రూ.1940 /- అలాగే 75 కే. జి ల ధర రూ.1445/- మరియు గ్రేడ్- ఏ రకము క్వింటల్ (100 కే జీ ) లకు ధర రూ.1960/- అలాగే 75 కే. జి ల ధర రూ.1470/- లకు కొనుగోలు చేస్తారని తెలిపారు.
అమ్ముకునే రైతు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకొని ఉండాలని,ఏ రైతు అయిన కూడా తన పంటను కనీస మద్దతు ధర కన్న తక్కువ అమ్ముకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
ధ్యానం అమ్ముకునే రైతులు రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని గ్రామాలలో దండోర ద్వారా టామ్ టామ్ వేయించడం జరుగుతుందని,అలాగే సచివాలయ పరిధిలోని వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని వాళ్లకు కేటాయించిన ఇళ్ల పరిధిలోని రైతులకు తెలియపరిచి సమాచారం చేరవేయాలని, అలాగే ఎవరెవరు రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కు అమ్ముకొంటారో మరియు లేదో ఒక అక్నౌలెడ్జిమెంట్ రూపంలో సేకరించి గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు వాళ్లకి సరైన సమయంలో అందజేస్తు సహాయంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఈ ఓ యస్. నాగార్జున , వ్యవసాయ సహాయకుడు రఘు వీర్, రైతులు సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు.