మంచినీటి సరఫరా కై రాస్తారోకో
ఒంగోలు – కర్నూలు జాతీయ రహదారిపై మంచినీటి సరఫరా చెయ్యాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక మాదాల వారి పాలెం వద్ద నగర పంచాయితీ 15వార్డుకు చెందిన ప్రజలు మంచినీటి సరఫరా చెయ్యాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో ను విరమింపజేశారు
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత నెల రోజులుగా తమకు మంచి నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని తక్షణమే అధికారులు స్పందించి తమకు మంచి నీటి సరఫరా కొనసాగించాలని డిమాండ్ చేశారు