రెండు వారాల్లో సమస్య పరిష్కరించకపోతే అమరావతిని ముట్టడిస్తాం: పవన్ కళ్యాణ్
చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు 5లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 50వేలు ఇవ్వాలి
మ్యాన్ ఫ్ర్రెడేలు కూడా నన్ను విమర్శించే స్ధాయికి వచ్చారని జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిలపై విమర్శలు…..
నా డియన్ఐ పై విమర్శలు చేస్తే తాట తీస్తా….
నేను ప్రజలకు దత్తపుత్రుడుని
కూల్చివేతతో మొదలైన ప్రభుత్వం కులిపోతుంది…..
ప్రత్యేక హోదా కోసం ప్రధానితో విభేదించా త్వరలోనే ప్రధానిని కలుస్తా
కులాలు దాడికి ముందుకు రాకపోతే రాష్ట్రానికి అధోగతి పడుతుంది
రెండువారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే అమరావతిని ముట్టడిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు నిరసనగా ఆదివారంనాడు విశాఖపట్టణంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన లాంగ్ మార్చ్ అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు 5లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 50వేలు రెండువారాల్లో ఇవ్వాలని లేకపోతే అమరావతి ముట్టడిస్తామని అన్నారు.
శుక్రవారం నాడు కోర్టు వెళ్ళే మ్యాన్ ఫ్రేడేలు కూడా నన్ను విమర్శించే స్ధాయికి వచ్చారని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిలను విమర్శించారు…… అదేవిధంగాసూట్ కేసు కంపెనీలు సృష్టించి డబ్బులను విదేశాలకు పంపిన సాయిరెడ్డి కూడా జనసేన పార్టీని విమర్శలు చెయ్యడం హస్యస్పదమని జైలు జీవితన్ని గుర్తు పెట్టుకోవాలిని తీవ్రంగా హెచ్చరించారు. ఫ్యాక్షన్ రాజకీయలకు బయపడే ప్రసక్తి లేదని అన్నారు, నా డియన్ఐ పై విమర్శలు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
నేను ప్రజలకు దత్తపుత్రుడనని….. కూల్చివేతతో మొదలైన ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని ప్రత్యేకహోదా కోసం ప్రధాని నరేంద్ర మోదీ విభేదించానని…. త్వరలో ప్రధాని మరియు ప్రభుత్వ అగ్రనేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిణామాలు వివరిస్తానని అన్నారు.
కులాలు దాటి బయటకు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పడుతుందని….. ప్రజలు గమనించి బయటకు రావాలని అదేవిధంగా లాంగ్ మార్చ్ కు సంఘీభావం తెలిపిన బిజెపి, సిపిఐ, సిపియం, బియస్పీ, లోక్ సత్తా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.