పొదిలి సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రాఘవేంద్ర

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కృష్ణం వీరా రాఘవేంద్ర శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న సుధాకర్ రావు విఆర్ కు బదిలీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కృష్ణం వీరా రాఘవేంద్ర మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ప్రధాన సమస్యలు అవగాహన చేసుకొని ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

ఈ విలేకర్ల సమావేశంలో పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు, కొనకనమిట్ల యస్ఐ దీప తాడివారిపల్లి యస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు