రఘువీరారెడ్డిని కలిసిన సాగర్ జలాల సాధన సమితి కమిటీ

పొదిలి సాగర్ జలాల సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద చెరువును సాగర్ జలాశయంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే కనిగిరి నందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వెళ్తున్న రఘువీరారెడ్డిని స్థానిక రోడ్లు మరియు భవనముల అతిధి గృహంవద్ద సాగర్ జలాల సాధన సమితి కమిటీ మరియు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాగర్ జలాల సాధన సమితి కమిటీ కన్వీనర్ పొల్లా నరసింహ యాదవ్ పొదిలిలోని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను వివరించి నీటి ఎద్దడిని తట్టుకోవడం కోసం పొదిలి పెద్దచెరువును సాగర్ జలాశయంగా మార్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు పొల్లా నరసింహ యాదవ్, బాబూరావు యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు చంద్రశేఖర్ యాదవ్, షేక్ సైదా, తదితరులు పాల్గొన్నారు.