రాజుపాలెం గ్రామంలో ఫ్లోరైడ్ నియంత్రణ బృందం సర్వే
రాజుపాలెం గ్రామంలో ఫ్లోరైడ్ నియంత్రణ బృందం సర్వే చేపట్టి నమూనాలు సేకరించింది. వివరాల్లోకి వెళితే 2017లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఫ్లోరైడ్ నియంత్రణ ప్రత్యేక కమిటీ స్థానిక రాజుపాలెంలోని ఫ్లోరైడ్ బాధితులను పరీక్షించి నీటి నమూనాలు సేకరించి వాటిని పరీక్షల నిమిత్తం జాతీయ ఫ్లోరైడ్ నియంత్రణ నిపుణులకు అందజేయగా నీటి పరీక్షల అనంతరం రాజుపాలెం గ్రామంలోని నీటిలో ఫ్లోరైడ్ అధిక శాతం ఉన్నట్లు గుర్తించారు. అందులో భాగంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ( ఎన్ఐఎన్) బృందం గురువారంనాడు రాజుపాలెం గ్రామంలో సర్వే చేపట్టి రెండువేల మందికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి నుండి రక్త, మూత్ర నమూనాలను సేకరించి వారి కుటుంబం రోజు భుజించే ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు పంపించడం జరుగుతుందని పరీక్షల అనంతరం బాధితులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కావలసిన ప్రయోజనాలు, వైద్యం,అందజేయడం కోసం సర్వే జరుగుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) బృంద ప్రతినిధి రాజు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎన్ బృదం హరి గౌడ్, యాదయ్య, శ్రీనివాస్, రవి కుమార్, శ్రీనువాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.