పొదిలి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన
అక్టోబరు 15నుండి 21 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పొదిలి ఎస్ఐ శ్రీరామ్ పిలుపుమేరకు బుధవారంనాడు పొదిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి పట్టణ యువత, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తొలుత పొదిలి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీరామ్, దొనకొండ ఎస్ఐ సుబ్బారావుల రక్తదానంతో శిబిరం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పట్టణ యువత మరియు ప్రజలు ఉత్సహంగా పాల్గొని మొత్తంగా 63మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాగే ప్రతి మంచి పనికి యువత, ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పొదిలి యువత, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీరామ్, దొనకొండ ఎస్ఐ సుబ్బారావు, పోలీసు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.