రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి: యస్ఐ శ్రీరామ్
పోలీసులకు, ప్రజలకు మద్య స్నేహం బంధాలను పెంపొందించే విధంగా పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు యస్ఐ శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. అక్టోబర్ 21 వ తేది పోలీసుల అమరవీర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని పొదిలి సిఐ మాకినేని శ్రీనివాసరావు ప్రారంభం చేస్తారని కావున ప్రజలు కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం పొంది ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని యస్ఐ శ్రీరామ్ ప్రకటనలో తెలిపారు.