జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ర్యాలీ మానవహారం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా మారుతి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి మరియు అంగన్వాడీ కార్యకర్తలు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు