పోషన్ అభియాన్ సందర్భంగా ర్యాలీ ప్రతిజ్ఞ మానవహారం
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ వరకు పోషన్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పిల్లవానికి పౌష్టికాహారం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పోషన్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని వయసుకు తగ్గ బరువు కలిగి ఉండే విధంగా అంగన్వాడీ సిబ్బంది తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు అదేవిధంగా సి డి పి ఓ పి సుధా మారుతి మాట్లాడుతూ ప్రధానమంత్రి వారి యొక్క పోషన్ అభియాన్ పథకం ద్వారా జనవరి 8 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ స్థాయిలో జరుగుతోందని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, ఉప్పలపాడు ప్రభుత్వ వైద్య అధికారిణి షేక్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు