శివాలయం భూముల నష్టపరిహారం మాకే చెల్లించాలంటూ పట్టుబట్టిన చిన్న, పెద్దమసీదు కమిటీలు
పట్టణంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయమైన పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన రైల్వే లైనులో కోల్పోయిన భూమి నష్టపరిహారం మాకు చెల్లించాలంటూ చిన్నమసీదు, పెద్దమసీదు కమిటీలు పట్టుబట్టాయి.
వివరాల్లోకి వెళితే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైనులో పొదిలి గ్రామ రెవిన్యూ సర్వే నంబరు 818నందు గల మొత్తం విస్తీర్ణం 8.40సెంట్లు కాగా అందులో 4.06 సెంట్లు భూమి రైల్వే లైనులో కోల్పోగా….. ఆ భూమి నిర్మమహేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినదిగా నిర్ధారించి నష్టపరిహారం దేవాదాయశాఖకు చెల్లించాలంటూ గెజిట్ లో పేర్కొనగా…..
తదుపరి కార్యాచరణ నిమిత్తం అభ్యంతరాలు, ఫిర్యాదులు, సవరణల నిమిత్తం అప్పీల్ చేసుకోవాలని కందుకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దేవాదాయశాఖ ఆస్తిగా పేర్కొన్న 818సర్వే నంబరులోని 8.40సెంట్లు మొత్తం భూమి మాదే అంటూ 50సంవత్సరాల నుండి మా అధీనంలోనే ఉందని….. అప్పటినుండి లీజుకు సంబంధించిన టెండర్ మొదలైనవి లావాదేవీలు మొత్తం మేమే జరుపుతున్నామని కాబట్టి నష్టపరిహారం మాకే చెల్లించాలంటూ చిన్నమసీదు, పెద్దమసీదు కమిటీలు ఆర్డీఓ కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ భూమికి సంబంధించిన నష్టపరిహారం ఎవరికి చెల్లించాలి… ఏ ప్రాతిపదికన చెల్లించాలి అనే విషయంపై ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే ఇప్పటికీ నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం పేరుమీదనే భూమి రిజిస్టర్ అయి ఉండడం విశేషం.
నిర్మమహేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమి కాబట్టి దేవాదాయశాఖకు నష్టపరిహారం చెల్లిస్తారా?….. లేక 50సంవత్సరాలుగా సాగు చేస్తున్నామని చెప్తున్న చిన్న,పెద్ద మసీదుల కమిటీలకు చెల్లిస్తారా?… అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న!