పొదిలి శివాలయాన్ని సందర్శించిన రామచంద్ర యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, బిసిలు, రైతుల అభ్యున్నతి కోసం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటులో నిమగ్నమై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తనదైనశైలిలో పావులు కదుపుతున్నా ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ పొదిలి పట్టణంలోని శివాలయాన్ని సందర్శించి పార్వతి సమేత నిర్మమహేశర స్వామి లను దర్శించుకున్నారు.
గిద్దలూరు నుంచి విజయవాడ వెళ్తు మార్గం మధ్యలో స్థానిక పొదిలి చెందిన అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ఆహ్వానం మేరకు శివాలయం దేవస్థానం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యాదవ మహాసభ నాయకులు తో భేటీ అయ్యారు.
మార్చి నెలలో పొదిలిలో జరిగే బిసిల ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నాట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మందగిరి వెంకటేష్ యాదవ్ మూరబోయిన బాబురావు యాదవ్,కనకం వెంకట్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు