పొదిలిటైమ్స్….. ఉత్తమ పాత్రికేయుడు అవార్డు గ్రహీత రామకోటిరెడ్డి
ఉత్తమ పాత్రికేయుడు అవార్డు గ్రహీతగా నాగిరెడ్డి రామకోటిరెడ్డిని ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి మండలంలో ధైర్యంగా వివిధ పనులలో జరిగిన అక్రమాలను వెలికితీసి మరియు అక్రమాలపై ప్రత్యేక కథనాలు వ్రాసి వాటి నివారణలో కీలకంగా వ్యవరించటం ప్రజల సమస్యలపై పలు కథనాలు వ్రాసి అధికారులు దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కారం కోసం కృషి చేస్తూ ఎల్లావేళలా ప్రజలపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందిన రామకోటిరెడ్డి సేవలను గుర్తించి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ పాత్రికేయుడు అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.