రసాభాసగా పెన్షన్, పసుపుకుంకుమ కానుకల పంపిణీ కార్యక్రమం….. పనిచేయని సర్వర్లు….. మొరాయించిన టాబ్ లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెట్టింపు భీమా – రెట్టింపు భరోసా కార్యక్రమంలో భాగంగా పెన్షన్లు మరియు పసుపుకుంకుమ కార్యక్రమం రసాభాసగా జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఏబిఎం స్కూల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో 2వతేది మాత్రమే పంపిణీ జరుగుతుందని ప్రజలకు అధికారుల అందజేసిన సమాచారం మేరకు పట్టణంలోని వృద్ధ, వికలాంగుల, వితంతు పెన్షన్లు మరియు డ్వాక్రా మహిళల పసుపుకుంకుమ కానుకలను పొందేందుదుకు ఉదయంనుండే వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా షామియానా, కుర్చీలు ఏర్పాటు చేసినప్పటికీ వేలాదిగా ప్రజలు కార్యక్రమానికి హజరవ్వడంతో కూర్చోవడానికి కుర్చీలులేక వారికి వచ్చిన పెన్షన్లు, పసుపుకుంకుమ కానుకలను త్వరగా తీసుకుని వెళ్లాలని ప్రజలు తొందరపడడంతో కార్యక్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటను నిలువరించడానికి పోలీసులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ మధ్యాహ్నం వరకు ఎలాగొలా వచ్చిన వారికి సర్దిచెప్పి పంపిణీ కార్యక్రమం నిర్వహించినప్పటికి సర్వర్ మొరాయించి టాబ్ లు పనిచేయకపోవడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. అయినప్పటికీ పెన్షన్ దారులు అధికారులను దాటుకుని కౌంటర్ల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా పరిస్థితిని అదుపులోకి తేవడానికి సిఐ చిన్న మీరాసాహెబ్, ఎస్ఐ శ్రీరామ్, ఎంపిడిఓ రత్నజ్యోతి, ఈఓఆర్డీ రంగనాయకులు, పోలీసు సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, కౌంటర్ల వద్దకు వెళ్ళేవారిని అడ్డుకుని 3వతేది కూడా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడంతో పరిస్థితి సర్దుమనిగింది.