కందుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఒంగోలు – నంద్యాల రహదారి పై తెలుగు దేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ పరిధిలోని కంభాలపాడు గ్రామంలోకి వచ్చిన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి దృష్టికి పలు ప్రజా సమస్యలు తీసుకొని రావటంతో స్థానిక సచివాలయాన్ని సందర్శించి అక్కడ నుండి నేరుగా గ్రామంలోని దళిత కుటుంబాలతో సమావేశమయిన కందుల దృష్టికి ఒక దళిత కుటుంబానికి నెలకు విద్యుత్ బిల్లు 21370 రూపాయలు రావటంతో పెన్షన్ అన్యాయం గా తొలగించారని అదే తమ కాలనీ నందు మరో 16 మందికి పైగా పెన్షన్లు తొలగింపు చేసారని అదే విధంగా ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు నష్టపరిహారం అందలేదని తెలపటం అప్పటికి అప్పుడే ఒంగోలు – నంద్యాల రహదారి పై మెరుపు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తక్షణమే చర్మకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఫసల్ బీమా యోజన ద్వారా నష్టం పొయినా ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు బృందం సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న కందుల నారాయణరెడ్డి తో మాట్లాడి రాస్తారోకో ను వివరింపజేశారు.
అనంతరం భారిగా నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవూలూరి కోటప్ప నాయుడు, చలగాలి రామయ్య తెలుగు దేశం పార్టీ నాయకులు పండు అనిల్, ముల్లా ఖూద్దుస్, మీగడ ఓబుల్ రెడ్డి , షేక్ గౌస్ భాష,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.