విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒంగోలు-కర్నూలు రహదారిపై రాస్తారోకో

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలు- కర్నూలు రహదారి నందు రాస్తారోకో నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక విశ్వనాథపురంలోని ఒంగోలు-కర్నూలు రహదారిపై విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ కంపెనీల సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్కరు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం మరియు వామపక్షాల నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.