టెలికాం టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని రాస్తారోకో భారీగా నిలిచిన ట్రాఫిక్… యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
టెలికాం టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ స్ధానికులు రాస్తారోకో నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద ఓ ప్రైవేటు టెలికాం సంస్థ చెందిన టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని….. తక్షణమే ఆ యొక్క నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు- కర్నూలు రోడ్డుపై స్ధానికులు రాస్తారోకో నిర్వహించారు.
భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న పొదిలి యస్ ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.