పిపిఈ కిట్లుతో రేషన్ పంపిణీ
నెల మొదలయ్యిందంటే రేషన్ షాపుల వద్ద రద్దీ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలందరికీ తెలుసు ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలతో రేషన్ పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు పిపిఈ కిట్లు ధరించి రేషన్ కోసం వచ్చే ప్రజలకు సానిటైజర్ అందుబాటులో ఉంచి వేలిముద్ర వేసే ముందు వేసిన తర్వాత సానిటైజర్ ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు…. ఈ విధంగా పట్టణంలోని రేషన్ షాపు నంబర్-32కు సంబంధించిన డీలర్ ఖాదర్ బాషా పిపిఈ కిట్ ధరించి పూర్తి జాగ్రత్తలతో రేషన్ షాపును నడపడం పొదిలి టైమ్స్ కాప్చర్ చేసింది.
మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రేషన్ షాపుల వద్దకు కూడా రనివ్వడం లేదు….. నేల మొదలవ్వగానే రద్దీగా ఉండే రేషన్ షాపుల వద్ద పేదలను ఇబ్బంది పెట్టకుండా రేషన్ అందించడంతో పాటుగా కోవిడ్ వ్యాప్తి నిరోధానికి ఇది ఒక మంచి పరిణామమనే చెప్పుకోవచ్చు.