తాలూకా ఆఫీస్ వీధి ట్రాఫిక్ లో చిక్కుకున్న ఆర్డీఓ సమస్యకు కారకులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్డీఓ ఆదేశాలు
మార్కాపురం నియైజకవర్గ ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి ఎన్నికల ఏర్పాట్ల పర్యావేక్షణలో భాగంగా సోమవారం పొదిలి తహశీల్ధార్ కార్యాలయానికి విచేస్తున్న సందర్భంగా తాలూకా ఆఫీస్ వీధిలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనాల కారణంగా సుమారు 15 నిమిషాలపాటు తన వాహనంలోనే ఉండడంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఎన్నికల అధికారి తక్షణమే వారిపై చర్యలకై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పూర్తి అయ్యో వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తహశీల్ధార్ కు ఆదేశాలు జారీ చేశారు.