భూ ఆక్రమణలపై ప్రమాణాలకు సిద్ధమా! ఖబడ్దార్ సైదా అంటూ హెచ్చరించిన వైకాపా నాయకులు

భూ ఆక్రమణలపై ప్రమాణాలకు తాము సిద్దమని నువ్వు సిద్ధమా! సైదా ఖబడ్దార్ అంటూ వైకాపా నాయకులు హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని స్థానిక రోడ్లు మరియు భవనముల అతిథి గృహం నందు బుధవారంనాడు వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా సామాజిక మాధ్యమాల్లో ఇంటి నివేశన స్థలాలు పంపిణీ కాంగ్రెసు పార్టీ ఘనత అని బినామీ పేర్లతో వైకాపా నాయకులు ప్రభుత్వం భూములను కైవసం చేసుకొనేందుకు రంగం సిద్దం చేశారనే ఆరోపణలపై స్పందిస్తూ….. వైకాపా నాయకులు జి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటి నివేశన స్థలాలు పంపిణీలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి మంచి పేరు రావడంతో ఓర్చుకోలేక అవాకులు చవాకులు పేలుస్తున్నారని సైదా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

స్థానిక రహదారులు భవనముల అతిథిగృహం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమపై వచ్చిన ఆరోపణలకు పొదిలి శివాలయంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని…… మసీదులో ప్రమాణానికి నువ్వు సిద్దామా సైదా అంటూ సవాల్ విసిరారు.

ఆక్రమణ దారుడే ఆక్రమణలను గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని…… సైదా తన భార్య పేరుమీద ఆక్రమణ ఒక ఎకరా పదిసెంట్ల భూమి వున్నదా లేదా అంటూ ప్రశ్నించారు.

టిడిపి తరపున జనరల్ ఏజెంట్ గా వుండి కాంగ్రెస్ కి పార్టికి అమ్ముడు పోయిన సైదా….. 1997లో స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చి స్థలాలను ఆక్రమించాడని……. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మైనార్టి కార్పొరేషన్ డైరెక్టరుగా పనిచేస్తూ పేద ముస్లింల రాయితీలను కొల్లగొట్టడం……అలాగే వెలుగొండ గ్రిన్ గిఫ్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వికాలాంగుల సొమ్ము తినడంతొ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడం నిజమా కాదా అంటూ ప్రశ్నించారు.

ఇటివల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 లక్షలకు బెదిరించి చివరకు లక్ష రూపాయలకు బేరమాడిన వ్యక్తి మాపై ఆరొపణలు చెయ్యడం హాస్యాస్పదంగా ఉందని…… నీ పై ఉన్న ఆరోపణలు అవాస్తవం అయితే నా ముక్కు నేలకు రాస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదాకు వైకాపా నాయకులు జి శ్రీను సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, కొత్తపులి బ్రహ్మరెడ్డి, షేక్ రబ్బానీ, గూడూరి వినోద్ కుమార్, షేక్ బంది సాహెబ్,భూమి రమేష్,కొత్తురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.