మూరబోయిన ఆధ్వర్యంలో చిన్నారులకు భరోసా

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

కొనకనమిట్ల మండలం గరిమినిపెంట గ్రామ పంచాయతీ పాతపాడు గ్రామానికి చెందిన శిరిపల్లె నాగమ్మ మతిస్థిమితం కోల్పోయిన సందర్భంగా ఆమెకు చెందిన గోవిందమ్మ, మహేశ్వరి, మహేష్,రామాంజీ అను నాలుగురు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ వారికి అండగా నిలిచారు.

తర్లబాడు మండలంలోని లింగారెడ్డి కాలనీ నందు మెర్సీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిరి అనాధ ఆశ్రమం నందు సదరు నాలుగురు పిల్లలు లను చేర్చి వారికి కావలసిన బట్టలు, పుస్తకాలు, నగదును మూరబోయిన బాబురావు యాదవ్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి,రావి వీరాంజనేయులు, వెలుగొండ రాయుడు , రామారావు, శ్రీనివాస్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు