సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని : ఒప్పంద ఉద్యోగుల సమావేశం డిమాండ్
సర్వ శిక్షా అభియాన్ ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పంద ఉద్యోగుల సమావేశం డిమాండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక పెద్ద బస్టాండులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో ఆదివారం నాడు జరిగిన సర్వ శిక్షా అభియాన్ ఒప్పంద ఉద్యోగుల చర్చా వేదిక సమావేశం శివకుమారి అధ్యక్షతనతో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది సంస్థ న్యాయ సలహాదారులు శశాంక్ మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని రాయితీలను కల్పించిస్తూ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఒప్పంద ఉద్యోగులు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర చేసే సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పంద ఉద్యోగులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేస్తానని హామీ ఇచ్చారని…… ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో మా సంస్థకు చెందిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగులుగా మార్చడం జరిగిందని…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వ శిక్షా అభియాన్ నందు పనిచేసే ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించే వరకు ఉద్యమాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ… తక్షణమే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ నాయకురాళ్ళు పేరు స్వాముల వసుంధర, అనురాధ, అవుల సునీత, వెంకట్రామిరెడ్డి, గుప్తా తదితరులు పాల్గొన్నారు.