వివాహాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వివాహాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందకు గ్రామ స్థాయిలో కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా మారుతి అన్నారు.
గురువారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సుధా మారుతి అధ్యక్షతనతో బాల్య వివాహాలు నివారణ కోసం పొదిలి మర్రిపూడి కొనకనమిట్ల మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు , అంగన్వాడీ కార్యకర్తలు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ ఎంఈఓ శ్రీనివాసులు మండల వైద్యాధికారిణీ సుష్మా మరియు మూడు మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు