కుంట పోరంబోకు ఆక్రమణలు తొలగింపు

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని కోట్లాది రూపాయల విలువైన కుంట పోరంబోకు భూమి ఆక్రమణలను మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియ ను ప్రారంభించారు.

శుక్రవారం నాడు స్థానిక పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 480/1 లో ఉన్న ఒక ఎకరా 58 భూమి ఆక్రమణలను జెసిబి పెట్టిన తొలగింపు ప్రక్రియ ప్రారంభించాగా శనివారం నాటికి తొలగింపు ప్రక్రియ పూర్తి అవుతుందని మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ, ఆర్ఐ సుబ్బారావు, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు