పొదిలి నగర పంచాయితీ నుండి మూడు పంచాయతీలను తొలగించండి: కందుల
పొదిలి నగర పంచాయితీ నుండి కంభాలపాడు , నంది పాలెం, మాదాలవారిపాలెం, గ్రామ పంచాయతీల విలీనం ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక చిన్న సమంతపూడి నాగేశ్వరరావు సా మీల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నగర పంచాయితీ ఏర్పాటుకు పొదిలి గ్రామ పంచాయతీ జనాభా సరిపోతుందని కాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కంభాలపాడు, నంది పాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలతో కూడిన పొదిలి నగర పంచాయితీ ఏర్పాటు చేశారని దాని వలన మూడు గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు వేల బిసి, యస్సీ ,యస్టీ కుటుంబాలు రోడ్డున పడి పరిస్థితి ఏర్పడిందని నగర పంచాయితీ ఏర్పాటు ద్వారా ఉపాధి హామీ పథకం రద్దు, ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు తోపాటు అదనంగా పలురకాల పన్నులతో వారికి గుదిబండగా తయారు అవుతుందని ఆయన అన్నారు
మూడు గ్రామ పంచాయతీ ప్రజలు ఉద్యమాన్నికి సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని మీరు ఏ విధంగా ముందుకు సాగినా తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని నారాయణరెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికల జరగకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం , టి యన్ యస్ యఫ్ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, తెలుగు దేశం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు సమంతపూడి నాగేశ్వరరావు, ఆవులూరి యలమంద, షేక్ రసూల్, సయ్యద్ ఇమాంసా, మీగడ ఓబుల్ రెడ్డి, జ్యోతి మల్లి, సోమయ్య,భూమ సుబ్బాయ్య, షేక్ యాసిన్, షేక్ మౌలాలి, బాదం రవి, షేక్ నజిర్, షేక్ సంధాని,తదితరులు పాల్గొన్నారు