బాలినేనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాలను వేదికగా పచ్చ గ్యాంగ్ అభియోగాలకు పాల్పడుతున్న వారిపై బాలినేని యువసేన నాయకులు పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ కు వినతిపత్రాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే గత కొద్దిరోజులుగా రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిపై పచ్చ గ్యాంగ్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అభియోగాలు ఆరోపణలు చేస్తున్నారని…… ప్రకాశం జిల్లాలో తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం వంటి ఎన్నో రకాల అభివృద్ధి చర్యలు తీసుకుంటున్న బాలినేని శ్రీనివాసులురెడ్డిని కొందరు కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు దొద్దేటిపల్లి సుబ్బనాచారి పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాలినేని యువసేన నాయకులు ఏటి శ్రీనివాస్ యాదవ్, జక్కిరెడ్డి రామకృష్ణ రెడ్డి లు పాల్గొన్నారు.