ఆక్రమణలు తొలగించండి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

పొదిలి పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

పొదిలి పట్టణంలోని పెద్ద చిన్న మసీదు సంబంధించిన భూముల్లో ఆక్రమణలు తొలగింపు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు ఆక్రమణలు తొలగింపు చెయ్యలేదని మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాషా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు

పొదిలి పట్టణంలో గత మూడు నెలలుగా సాగర్ నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారం కృషి చేయాలని కోరుతూ 20 అర్జీలు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అందజేశారు.

హోం గార్డులకు ఇంటి నివేసనల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వినతిపత్రాన్ని అందజేశారు

పొదిలి పట్టణంలోని 40 అడుగుల వెంకటేశ్వర సినిమా థియేటర్ రోడ్డు ఆక్రమణకు గురైందని ఆక్రమణలు తొలగించాలని కోరుతూ మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కసిరెడ్డి వెంకట రమణ రెడ్డిలు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు

అప్కాస్ లో పొదిలి నగర పంచాయితీ కార్మికులు చేర్చాలని కోరుతు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు

పొదిలి జగనన్న లే ఔట్ నందు తమకు మూడు పట్టాలు మంజూరు చేసిన ఒక దానిలో కూడా తమకు పొజిషన్ చూపించా లేదని
పొదిలి పట్టణం నవాబ్ మిట్ట చెందిన షేక్ చాంద్ భాషా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు

 

అదే విధంగా పొదిలి పట్టణంలో త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల్లో మురుగు దోడ్లు, కాల్వలు, సిమెంట్ రోడ్లు కోసం మరియు ఆక్రమ లే ఔట్ లు అక్రమ నిర్మాణాలు, పట్టాదారు పాస్ బుక్ లు మంజూరు కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమంలో వినతిపత్రలను అందజేశారు

స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవటం ద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని కావున మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధించిన అధికారులను ఆదేశించారు