పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రిజర్వేషన్ ఖరారు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యస్సీ మహిళా రిజర్వేషన్ చేస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసారు.

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గత రెండు సంవత్సరాల పాటు బిసి మహిళా రిజర్వేషన్ కావటంతో గుర్రపుశాల కోటేశ్వరి ఛైర్మన్ గా పని చేసారు.

బిసి మహిళా మైనారిటీ కేటగిరీ కింద రిజర్వేషన్ అయినట్లు షేక్ నూర్జహాన్ ఛైర్మన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగిన చివరి క్షణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యస్సీ మహిళా లకు కేటాయింపు తో ఛైర్మన్ పదవి ఆశించిన బిసి ఓపెన్ కేటగిరీ చెందిన ఆశావాహులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

యస్సీ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో పొదిలి,కొనకనమిట్ల తర్లబాడు మండలంలోని చెందిన పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సంబందించిన ఎంపిక ప్రక్రియను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించినట్లు పార్టీ వర్గాల సమాచారం