రేషన్ దుకాణంలో చోరి….. 1.65 లక్షలు దోచుకెళ్లిన దొంగలు
స్థానిక విశ్వనాధపురంలోని పవర్ ఆఫీసు రోడ్డులోని రేషన్ దుకాణం 24లో శుక్రవారం రాత్రి దొంగలు 1.65లక్షలు నగదు దోచుకెళ్లారు. రేషన్ దుకాణ యజమాని తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం దుకాణ సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో దుకాణంలోని బీరువాలో 1.50లక్షలు పది రూపాయల కట్టలు మరియు దుకాణంలోని అమ్మకం నగదు 25వేల రూపాయలు బీరువాలో పెట్టి శనివారం ఉదయం రేషన్ ఇవ్వడం కోసం దుకాణం వద్దకు వచ్చి చుడగా దుకాణం తాళాలు పగులకొట్టి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా లోపల బీరువాలో ఉండవలసిన డబ్బులో 10వేల రూపాయలు పది రూపాయల కట్టలు మాత్రమే ఉంచి దొంగలు 1.40లక్షలు పది రూపాయల కట్టలు మరియు అమ్మకం 25వేల రూపాయలు మొత్తం కలిపి 1.65లక్షలు దొంగిలించారని, బీరువాలో నగదు తప్ప ఆభరణాలు ఏమి లేవని తెలిపారు. రేషన్ షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.