పొదిలిటైమ్స్ కథనానికి స్పందించిన దేవాదాయశాఖ
పొదిలిటైమ్స్ కథనానికి దేవాదాయశాఖ అధికారులు స్పందించారు.
వివరాల్లోకి వెళితే ఇటీవల పొదిలిటైమ్స్ లో అంకాలపరమేశ్వరి “అమ్మవారి ఆస్తుల అన్యాక్రాంతం… కోట్లాదిరూపాయల అమ్మవారి ఆస్తులకు ఎసరుపెట్టిన భూ భకాసురులు” కథనంపై పొదిలి దేవాదాయశాఖ అధికారులు పెదవివిప్పారు.
బుధవారంనాడు దేవాదాయశాఖ కార్యనిర్వాహక అధికారి పొదిలి ఇంచార్జి అంజనీదేవిని కలిసిన పొదిలిటైమ్స్ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ గత సంవత్సరంలో రైల్వే లైనులో కోల్పోయిన అమ్మవారి ఆలయానికి సంబంధించిన భూములకు నష్టపరిహారం తమకే చెల్లించాలంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా…..
ఈ విషయంపై మండల రెవిన్యూ తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని…. అనంతరం కందుకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని విచారణ అనంతరం కూడా ఆర్డీవో కోర్టులో ఎటువంటి న్యాయం జరగనందున త్వరలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని….. అమ్మవారి ఆస్తులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉన్నామని ఆమె తెలిపారు.