ఎంఎల్ఏ కుందూరు ఆధ్వర్యంలో స్పందన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి మండలం సూదనగుంట సచివాలయం నందు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గురువారం నాడు స్థానిక సూదనగుంట గ్రామంలోని గ్రామ సచివాలయం నందు నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కసిరెడ్డి వెంకట రమణ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండల అధ్యక్షుడు హనిమున్ శ్రీనివాసులు రెడ్డి వివిధ శాఖల అధికారులు గ్రామ సచివాలయం సిబ్బంది మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు