రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారిగా విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియామిస్తు ఆదేశాలు జారీచేసింది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారంనాడు ‌రహస్యంగా తీసుకుని వచ్చిన ఆర్డినెన్సు ద్వారా తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ నియామకం చేయడం తదుపరి వెంటనే బాధ్యతలు స్వీకరించి అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మర్యాద పూర్వకంగా కలిశారు.