రెవెన్యూ గ్రామసభలో దేవస్థాన భూములపై అభ్యంతరాలు

పొదిలి మండల రెవెన్యూ శాఖకు చెందిన సెక్షన్ 22(ఎ) ఆస్తులపై అభ్యంతరాలపై స్థానిక రెవెన్యూ తహాశీల్ధార్ కార్యలయంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన గ్రామసభలో దేవస్థాన భూములపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పొదిలి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 384/5 లో ఒక ఎకరా భూమి వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూమిగా ఎఫ్ ఎల్ ఆర్ నమోదు అయ్యింది సదరు రికార్డులో వేణుగోపాలస్వామి పేరును రౌండ్ చేసి ఇతరుల పేరు నమోదు చేశారు. సదరు భూమి నందు వెంచర్ వేసి ప్లాట్ల ఆమ్మకాలు ప్రారంభించారు. సదరు భూమి లో అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లు మరియు నిర్మాణాలపై 2011లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు సామాజిక కార్యకర్త మందగిరి వెంకటేష్ యాదవ్ ఫిర్యాదు చేయగా క్రయవిక్రయలు నిలిచిపోయాయి. ఆ యొక్క భూమిలో నిర్మాణాలు చేపట్టిన కొనుగోలుదారులు సుమారు 25 మంది న్యాయవాది శ్రీపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ సభలో తహాశీల్ధార్ విద్యాసాగరుడుకు తమ వద్ద గల హక్కు ధ్రువీకరణ పత్రాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగరుడు మాట్లాడుతూ త్వరలో విచారణ జరుపుతానని తెలిపారు. దేవస్థానానికి చెందిన భూములపై అధికారులకు బాధితులు తమ అభ్యంతరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన శాఖ అధికారిణి అంజని దేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, సర్వేయర్ రత్నకర్, రెవిన్యూ కార్యదర్సులు మురళి, చలమారెడ్డి, మీరాబి, బ్రహ్మా రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.