నీటి సరఫరా విద్యుత్ అలంకరణ ప్రాధాన్యత
90 లక్షల రూపాయలతో నగర పంచాయితీ లో అభివృద్ధి పనులు
త్వరలో నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లింపులు
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వెల్లడి
పొదిలి నగర పంచాయితీ నందు మంచినీటి సరఫరా పైప్ లైన్లు, విద్యుత్ అలంకరణ కోరకు 90 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు నగర పంచాయితీ సమీక్ష సమావేశం లో నిర్ణయించినట్లు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు నగర పంచాయితీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు త్వరలో జీతాలు చెల్లింపులు జరుగుతాయిని వివిధ అభివృద్ధి పనులు వాటికి సంబంధించిన నిధులు మంజూరు అంశాలు గురించి చేర్చిమని అన్నారు.
నగర పంచాయితీ నందు పెండింగ్ బిల్లులు అన్ని చెల్లింపులు జరుగుతాయి అని అన్నారు.
మండల పరిధిలోని అంగన్వాడీ భవనాలు, సచివాలయల భవనాలు త్వరలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వైకాపా నాయకులు వాకా వెంకట రెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి,గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు