ఘనంగా లూయిస్ డాగురే వర్ధంతి
ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ పాత యూనియన్ ఆధ్వర్యంలో లూయిస్ డాగురే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 169వ వర్ధంతి సందర్భంగా పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ పాత యూనియన్ ఆధ్వర్యంలో లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు భోజనాలను ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ నాయకులు రావూరి శ్రీకాంత్, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి యూనియన్ నాయకులు లింగాల సురేష్, మహన్త అశోక్, శ్రీనివాసులు, ప్రసాద్, మల్లి, కృష్ణ, కోటి, శ్రీను, నరేంద్ర, వెంకటేశ్వర్లు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.