ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
వివరాల్లోకి వెళితే స్థానిక వాసవీ కళ్యాణ్ సదన్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి భారతీయ జనతాపార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు వారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడని ఆయన ఆత్మబలిదానం ఫలితంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైయి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మువ్వల పార్ధసారధి, మాగులూరి రామయ్యా, యస్ శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, పందింటీ మురళి తదితరులు పాల్గొన్నారు